Chetiki Gajulla by rampandu-bellary
రాధాకళ్యాణం--1981
సంగీతం::K.V.మహదేవన్
రచన::జ్యోతిర్మయి
గానం::S.P.బాలు
చేతికి గాజుల్లా..కళ్ళకు కాటుకలా
చేతికి గాజుల్లా..కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు
చేతికి గాజుల్లా..కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు
చరణం::1
మానసమున నీ ప్రణయము మారుమ్రోగగా
కావ్యగానమాలపించి కవి నేనైతి
మానసమున నీ ప్రణయము మారుమ్రోగగా
కావ్యగానమాలపించి కవి నేనైతి
మధుమాసం చెలి మోమున విరిబూయగనే
మధుమాసం చెలి మోమున విరిబూయగనే
భావ రాగ తాళములను మేళవించితీ
యేటికి కెరటంలా పాటకు చరణంలా
సీతకు రాముడిలా రాధకు మాధవుడు
చేతికి గాజుల్లా..కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు
చరణం::2
పూల పరిమళాల గాలి పలుకరించగా
నీలి నీలి మేఘమాల పరవశించెను
పూల పరిమళాల గాలి పలుకరించగా
నీలి నీలి మేఘమాల పరవశించెను
నవనీతపు చెలి హృదయము నను చేరగనే
నవనీతపు చెలి హృదయము నను చేరగనే
అతిశయమున బ్రతుకు వీణ శృతులు చేసెనూ
పగటికి సూర్యునిలా రేయికి జాబిలిలా
గౌరికి ఈశునిలా రాధకు మాధవుడు
చేతికి గాజుల్లా..కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు
No comments:
Post a Comment