Monday, January 20, 2014

సింధూరం--1998

సంగీతం::శ్రీనివాస్ చక్రవర్తి 
రచన::చంద్రబోస్
గానం::కృష్ణం రాజ్, మాధవపెద్ది సత్యం, ప్రదీప్

పల్లవి::

ఏడుమల్లెలెత్తు సుకుమారికి 
ఎంత కష్టవొఁచ్చింది నాయనో 
భోగిపళ్ళు పొయ్యాలి బేబికి 
ఏవి దిష్టి కొట్టింది నాయనో 
ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెవఁట్లు పట్టాయిరో 
మంచుబొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో 
ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెవఁట్లు పట్టాయిరో 
మంచుబొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో 

చరణం::1

పాతమంచవిఁదిగో పట్టుకొచ్చినానురో 
భగ్గుమంటు మండుతాదిరో 
పేకతల్లిరో పీకులాడమందిరో 
సందు చూసి సద్దుకోరో హోయ్ 
బోడిజుత్తు వుందని కోడిపుంజు కావురో 
కాలుదువ్వి రాకయ్యో 
వెక్కిరించినా ఎంత చక్కగుంటవే నా పడుచు పావురాయో 
అలా మాయమాటలాడితె ఐసైపోనయ్యా 
బలాదూరు మానకుంటె భరతం పడతడు మా మావఁయ్య 

హరిలోరంగాహరీ చూడరో దీనల్లరి 
గాదెలో నిండే వరి వీధిలో చిందే సిరి 

సువ్వి సువ్వి గొబ్బిళ్ళ పాటకి 
నవ్వి నవ్వి తాళాలు వెయ్యరో 

చరణం::2

ఎంత గోలపెట్టినా నెత్తివీదకొచ్చెరో కుంకుడు స్నానాలూ 
చింత మొద్దులా అంత నిద్దరేందిరా ఏవాయె పౌరుషాలూ 
ఎముకలు కొరికే ఈ చలి పులినీ చెవటలు కక్కించరో 
అహ మంచుకడ్డీలా వున్న రేయిని మంటపాలు చెయ్యి లేవో 
ప్రతీ ఇంట బూరెల వంట మహబాగుంది సరే 
కనుందాక కక్కా ముక్కా దొరకదు అది ఒక లోటే గదరో

సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో 
గంగిరెద్దు ఇంటకొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో 

తెలుగింట లోగిళ్లలోనికి పెద్ద పండగొచ్చింది చూడరో 
కిలకిల సందళ్ళ కోయిల కొత్త పొద్దు తెచ్చింది చూడరో 

సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో 
గంగిరెద్దు ఇంటకొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో 

సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో 
గంగిరెద్దు ఇంటకొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో 

Sindhooram--1998
Music::Srinivasa Chakravarthy
Lyrics::Chandrabose
Singer's::Krishnam raj, Madhavapeddi Satyam, Pradeep

::::

Edumalleletthu sukumariki 
Entha kashtamocchindi choodaro
Bhogi pallu poyyali baby ki
Evi dishti kottindi naayano
Mugulettu mucchatlalalo mucchematlu pattayiro
Manchu botlu aa buggalo aggi chukklainayiro
Mugulettu mucchatlalalo mucchematlu pattayiro
Manchu botlu aa buggalo aggi chukklainayiro

::::1

Paatha manchamidigo pattukocchinaanuro
Bhaggumantu mandutaadiro
Pekathalliro peekulaadamandiro
Sandu chusi saddukoro hoi...
Bodi juttu undani kodi punju kaavuro
Kaalu duvvi raakayyo
Vekkirinchina entha chakkaguntave na paduchu paavuraayo
Alaa maataladithe ice aiponayyo
Baladur manakunte bharatham padathadu maa mavayya

Harilo ranga hari chudaro deenallari
Gaadhelo ninde vari veedhilo chinde siri

Suvvi suvvi gobbilla paataki
Navvi navvi thaalaalu veyyaro

::::2

Entha gola pettina netti meedakocchero kunkudu snaanalu
Chintha moddhula antha niddarendiro evaaye pourushaalu
Emukalu korike ee chali pulini chematalu pattincharo
Aha manchu kaddila unna reyini manta paalu cheyyalevo
Prathi inta boorela vanta maha bagundi sare
Kanumdaka kakka mukka dorakadu adi oka lote kadaro

Sankuratri pandagocchero sambaraalu tecchenuro
Gangireddu intakocchero gangadolu duvvi pamparo

Teluginti logillaloniki pedda pandagocchindi chudaro
Kila kila sandalla koyila kottha poddu tecchindi chudaro

Sankuratri pandagocchero sambaraalu tecchenuro
Gangireddu intakocchero gangadolu duvvi pamparo

Sankuratri pandagocchero sambaraalu tecchenuro
Gangireddu intakocchero gangadolu duvvi pamparo

No comments: