Tuesday, January 07, 2014

డాన్స్ మాస్టర్--1986












సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి 
గానం::S.P.బాలు

పల్లవి::

హహహహహహ్హహహ
హహహహహహహహహ

రేగుతున్నదొక రాగం..ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం..నది లో అలలా
కనులే ముద్దులాడగా..కలలే కన్ను గీటగా
కసిగా..ఆ..ఆ..
రేగుతున్నదొక రాగం..ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం..నది లో అలలా

చరణం::1

చెక్కిళ్ళలో ముద్దు చెమ్మ..తడి ఆరకున్నది
నీ కళ్ళలో నీటి బొమ్మ..కదలాడిందే
తెలిపింది కన్నె గళమే..మనువాడ లేదనీ
ఓ పువ్వు పూసింది ఒడిలో..తొలి ప్రేమల్లే
మెలకువే స్వప్నమై..మెలి తిరిగెను నాలో
ఒరిగినా ఒదిగినా..హత్తుకునే ప్రేమ
నీ పిలుపే నిలిచే వలపై..పెదవుల్లో దాగి

రేగుతున్నదొక రాగం..ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం..నది లో అలలా
కనులే ముద్దులాడగా..కలలే కన్ను గీటగా
కసిగా..ఆ..ఆ..

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా

చరణం::2

తారాడు తలపులెన్నో..నీలాల కురులలో
తనువు మరచిపోయె..మనులే పొంగే
ముద్దాడ సాగె పెదవి..ఒక మూగ భావమే
చాటు కవితలన్నీ..అనురాగాలే
పెదవులే విచ్చిన..మల్లెపూల వాసన
సొగసులే సోకిన..వయసుకే దీవెన
వీరెవరో జత కోకిలలో..ఎద లేడై లేచి

రేగుతున్నదొక రాగం..ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం..నది లో అలలా
కనులే ముద్దులాడగా..కలలే కన్ను గీటగా
కసిగా..ఆ..ఆ..

రేగుతున్నదొక రాగం..ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం..నది లో అలలా

No comments: