Thursday, September 19, 2013

చెంచులక్ష్మి--1958::మారుబిహాగ్::రాగం





సంగీతం::S రాజేశ్వరరావు 
రచన::ఆరుద్ర 
గానం::ఘంటసాల

మారుబిహాగ్::రాగం
(హిందుస్తాని కర్నాటక )

పల్లవి::

నీలగగనఘనశ్యామా..ఘనశ్యామా దేవ
నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
దేవ నీలగగన...ఘనశ్యామా
హాని కలిగితే అవతారాలను
హాని కలిగితే అవతారాలను..పూని బ్రోచునది నీవే కావా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

చరణం::1

చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమరూపా
చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమరూపా
వేద నిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

చరణం::2

కడలి మధించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి
కడలి మధించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి
అతివ రూపమున అమృతము గాచిన ఆదిదేవుడవు నీవే కావా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

చరణం::3

సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగనేరము
సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగనేరము
పెండ్లికొడుకువై వెడలి నాడవు ఎందుల కొరకో..హే! జగదీశా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

No comments: