సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్ర రావ్
గానం::M.L.వసంతకుమారి బృందం
తారాగణం::N.T. రామారావు,అక్కినేని, S.V. రంగారావు,రేలంగి, R. నాగేశ్వరరావు,
C. S. R. ఆంజనేయులు,గుమ్మడి,సావిత్రి,ఛాయాదేవి,ఋష్యేంద్రమణి
దేశ్::రాగం
{దేశ దేశి}
{కేదారగౌళ కర్ణాటకకు చేరువ}
శ్రీకరులు..దేవతలు శ్రీరస్తులనగా
చిన్నారి..శశి రేఖ..వర్ధిల్లవమ్మా
వర్ధిల్లు..మా తల్లి..వర్ధిల్లవమ్మా
చిన్నారి..శశి రేఖ..వర్ధిల్లవమ్మా
సకల సౌభాగ్యవతి రేవతీ దేవి
తల్లియై దయలెల్ల వెల్లువిరియగనూ
సకల సౌభాగ్యవతి రేవతీ దేవి
తల్లియై దయలెల్ల వెల్లువిరియగనూ
అడుగకే వరములిడు బలరామ దేవులె
జనకులై కోరినా వరములీయగనూ
వర్ధిల్లు..మా తల్లి వర్ధిల్లవమ్మా
చిన్నారి..శశి రేఖ..వర్ధిల్లవమ్మా
శ్రీకళల విలసిల్లు రుక్మిణీ దేవి
పినతల్లియై నిన్ను గారాము శాయ
శ్రీకళల విలసిల్లు రుక్మిణీ దేవి
పినతల్లియై నిన్ను గారాము శాయ
అఖిల మహిమలు గలుగు కృష్ణ పరమాత్ములే
పినతండ్రియై సకల రక్షణలు శాయ
వర్ధిల్లు..మా తల్లి వర్ధిల్లవమ్మా
చిన్నారి శశి రేఖ..వర్ధిల్లవమ్మా
ఘన వీర మాతయగు శ్రీ సుభద్రా దేవి
మేనత్తయై నిన్ను ముద్దు శాయగనూ
ఘన వీర మాతయగు శ్రీ సుభద్రా దేవి
మేనత్తయై నిన్ను ముద్దు శాయగనూ
పాండవా యువరాజు బాలుడభిమన్యుడే
బావయై నీ రతన లోకమని మురియా
వర్ధిల్లు..మా తల్లి..వర్ధిల్లవమ్మా
చిన్నారి శశి రేఖ..వర్ధిల్లవమ్మా
చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా
No comments:
Post a Comment