Thursday, March 14, 2013

జీవితరంగము--1974

సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::రాజశ్రీ 
గానం::P.సుశీల 
తారాగణం::గుమ్మడి,చంద్రమోహన్,ఎస్.వి.రంగారావు,సావిత్రి,ప్రమీల,రమాప్రభ,జయసుధ

పల్లవి::

యీ నాటి నా పాట నీకు అంకితం..అందించావూ మాకు కొత్త జీవితం   

కని పెంచిన వారి కన్న మిన్నగా..మా కలలన్నీ తీర్చావు నిండుగా..ఆ  
కనిపించే దైవానివి నీవూ..కనిపించని త్యాగానివి నీవూ..ఆ        
యీ నాటి నా పాట నీకు అంకితం..అందించావూ మాకు కొత్త జీవితం   

చరణం::1

ఎందరికో నీడను తానిచ్చుటకూ..ఎండలోన చెట్టు మాడిపోతుంది

నలుగురికీ వెలుగును అందించుటకు..నిలువున క్రొవ్వొత్తి కరిగిపోతుంది           
నీడవు నీవై వెలుగువు నీవై..మా అందరినీ మునుముందుకు నడిపించావూ  
యీ నాటి నా పాట నీకు అంకితం..అందించావూ మాకు కొత్త జీవితం   

చరణం::2

మూడుముళ్ళు పడవలసిన వయసులో..తోడులేని బ్రతుకు గడుపుతున్నావూ   

తాడి పాడి తిరిగే యీ వేళలో..అంతులేని బాధ్యతలో మునిగావూ
నిద్దురలోన మెలుకువలోన..మా కోసమే నీవు కలలు కంటున్నావూ
మా కోసమే నీవు కలలు కంటున్నావూ           

No comments: