Sunday, November 24, 2013

గజదొంగ--1980

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు,S.సుశీల
Director::K.RaghavEndraRao 
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జయసుధ,K.సత్యనారాయణ,గుమ్మడి,జయమాలిని.

పల్లవి::

ఇంద్రధనుస్సు చీర కట్టి..చంద్ర వదన చేరవస్తే 
చుక్కలకే కులుకొచ్చిందంట..సూర్యుడికే కునుకోచిన్దట

ఇంద్రధనుస్సు చీర కట్టి..చంద్ర వదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిదంట

చరణం::1

నడిరేయి సమయాన..ఓడిచేరు తరుణాన 
నక్షత్ర చేమంతి జడలల్లనా
నవ్వుల్లో తోలిపువ్వు నీ గిల్లనా 
ప్రేమ అనే కౌగిలిలో..పెళ్లి అనే పందిరిలో 
ఇచ్చి పుచ్చుకున్న మాట మంత్రమాయేలే 
ఇద్దరుక్కటైన పాట మనుగడాయేనే 

ఇంద్రధనుస్సు చీర కట్టి..చంద్ర వదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిదంట

చరణం::2

ఆరారు ఋతువుల్లో..అందాల మధువుల్లో 
అరుదైన రుచులేన్నే అందించనా
విరితేనే లో స్నానమాడించనా 
పరువమనే పల్లకిలో..అందమనే బాలికలా 
వాలుకనుల వలపు గనుల..నీలి మెరుపులో 
పిలుపులేవో మేలుకొలిపే..ఈ ఉషస్సులో

ఇంద్రధనుస్సు చీర కట్టి..చంద్ర వదన చేరవస్తే 
చుక్కలకే కులుకొచ్చిందంట..సూర్యుడికే కునుకోచిన్దట
GajaDonga--1980
Music::chakravarti 
Director::K.RaghavEndraRao 
Lyrics::VeeturiSundaraRamaMoorti
Singer::S.P.Baalu,P.Suseela
Cast::N.T.Ramarao,Sreedevi,Jayasudha,K.Satyanarayana,Gummadi,Jayamalini.

:::::::::

indradhanussu cheera kaTTi..chandra vadana chEravastE 
chukkalakE kulukochchindanTa..sooryuDikE kunukOchindanTa

indradhanussu cheera kaTTi..chandra vadana chEravastE
choopulakE palukochchindanTa jaabilikE naDakochchidanTa

::::1

naDirEyi samayaana..ODichEru taruNaana 
nakshatra chEmanti jaDalallanaa
navvullO tOlipuvvu nee gillanaa 
prEma anE kaugililO..peLLi anE pandirilO 
ichchi puchchukunna maaTa mantramaayElE 
iddarukkaTaina paaTa manugaDaayEnE 

indradhanussu cheera kaTTi..chandra vadana chEravastE
choopulakE palukochchindanTa jaabilikE naDakochchidanTa

::::2

aaraaru RtuvullO..andaala madhuvullO 
arudaina ruchulEnnE andinchanaa
viritEnE lO snaanamaaDinchanaa 
paruvamanE pallakilO..andamanE baalikalaa 
vaalukanula valapu ganula..neeli merupulO 
pilupulEvO mElukolipE..ee ushassulO

indradhanussu cheera kaTTi..chandra vadana chEravastE 

chukkalakE kulukochchindanTa..sooryuDikE kunukOchindanTa

No comments: