Tuesday, September 21, 2010

నాటకాల రాయుడు--1969

సంగీతం::G.K.వెంకటేష్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::P.సుశీల

వేళచూడ వెన్నెలాయె..లోన చూడ వెచ్చనాయె
ఎందుకో మరి తెలియదాయె రేయి మాత్రం గడిచిపోయె

వేళచూడ వెన్నెలాయె..లోన చూడ వెచ్చనాయె
ఎందుకో మరి తెలియదాయె రేయి మాత్రం గడిచిపోయె

కొమ్మకొమ్మకు చిగుళ్ళయె..గుండెనిందా గుబుళ్ళాయె

కొమ్మకొమ్మకు చిగుళ్ళయె..గుండెనిందా గుబుళ్ళాయె
పువ్వు పువ్వున తుమ్మదాయె..పోంగువయసుతో పోరులాయె
ఎందుకోమరి తెలియదాయె..రేయిమాత్రం గడచిపోయె

కినుకుపడితె..ఉలికిపడుతాయె..
కినుకుపడితె..ఉలికిపడుతాయె
మెలకువైతె..కునుకురాదాయె
వల్లమాలిన..వగలతోటె.. ..భళ్ళుభళ్ళున తెల్లవారె
ఎందుకోమరి తెలియదాయె..రేయిమాత్రం గడచిపోయె

సరసమెరుగని చందమామ..చాటుమాటుగ సాగిపోయె

సరసమెరుగని చందమామ..చాటుమాటుగ సాగిపోయె
వెంటనున్న చుక్కకన్నె..జంటవుండీ ఒంటరాయె..
ఎందుకోమరి తెలియదాయె..రేయిమాత్రం గడచిపోయె..
వేళచూడ వెన్నెలాయె..లోన చూడ వెచ్చనాయె
ఎందుకో మరి తెలియదాయె రేయి మాత్రం గడిచిపోయె

ఎందుకో మరి తెలియదాయె రేయి మాత్రం గడిచిపోయె
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

No comments: