Tuesday, August 03, 2010

శ్రీకృష్ణ విజయం--1971::శివరంజని::రాగం






















సంగీతం::పెండ్యాల నాగే శ్వరరావు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల, P.సుశీల

శివరంజని::రాగం 

పల్లవి::

కృష్ణా..
కృష్ణా..ప్రేమమయా
నా జీవితము..నీకంకితము
నీవే నాకు..ఆలంబనము
నా జీవితము..నీకంకితము
నీవే నాకు..ఆలంబనము
నా జీవితము..నీకంకితము

చరణం::1

కన్నెమనసు కదిలించితివి
కలలు రేపే నన్ను కరిగించితివి
వలపు విందు చవి చూడకముందే 
వలపు విందు చవి చూడకముందే 
తొలచివేసితివి బ్రతుకే కథ చేసితివి
॥జీవితము॥

చరణం::2

కృష్ణా..కృష్ణా..దయసాగరా
నా జీవితము..నీకంకితము
నీవే నాకు..ఆలంబనము
నా జీవితము..నీకంకితము
లేమిని..ఓర్చితిని
నిన్నేమని అడుగక..నమ్మితిని
నమ్మనివారలు..పెట్టిన బాధలు
నీ లీలేనని..భరించితిని
నా శక్తికి మించిన..పరీక్ష నీది
నీ తృప్తికి చాలని..భక్తియా నాది
నా జీవితము..నీకంకితము
నా జీవితము..నీకంకితము

చరణం::3

ఇచ్చిన మనసు..వసివాడక మునుపే
వచ్చి ఏలుకోవేమి స్వామీ..వచ్చి ఏలుకోవేమి
చెర విడిపించి చెడునోడించి..ఉనికిని చాటుము స్వామీ
నీ ఉనికిని చాటుము..స్వామీ
రావేమి నా స్వామీ..రావేమి నా స్వామీ
స్వామీ నా స్వామీ..స్వామీ కృపరాదేమీ


SreekrshnaVijayam--1971
Music::Pendyaala
Lyrics::Acharya Atreya
Singer's::Ghantasala,P.Suseela

pallavi::

kRshNaa..
kRshNaa..praemamayaa
naa jeevitamu..neekaMkitamu
neevae naaku..aalaMbanamu
naa jeevitamu..neekaMkitamu
neevae naaku..aalaMbanamu
naa jeevitamu..neekaMkitamu

::1

kannemanasu kadiliMchitivi
kalalu raepae nannu karigiMchitivi
valapu viMdu chavi chooDakamuMdae
valapu viMdu chavi chooDakamuMdae
tolachivaesitivi bratukae katha chaesitivi
jeevitamu

::2

kRshNaa..kRshNaa..dayasaagaraa
naa jeevitamu..neekaMkitamu
neevae naaku..aalaMbanamu
naa jeevitamu..neekaMkitamu
laemini..Orchitini
ninnaemani aDugaka..nammitini
nammanivaaralu..peTTina baadhalu
nee leelaenani..bhariMchitini
naa Saktiki miMchina..pareeksha needi
nee tRptiki chaalani..bhaktiyaa naadi
naa jeevitamu..neekaMkitamu
naa jeevitamu..neekaMkitamu

::3

ichchina manasu..vasivaaDaka munupae
vachchi aelukOvaemi svaamee..vachchi aelukOvaemi
chera viDipiMchi cheDunODiMchi..unikini chaaTumu svaamee
nee unikini chaaTumu..svaamee
raavaemi naa svaamee..raavaemi naa svaamee
svaamee naa svaamee..svaamee kRparaadaemee

No comments: