నందమూరితారక రామారావ్ గారి జన్మదిన శుభాకాంక్షలు
జగదేకవీరుని కథ--1961
సంగీతం::పెండ్యాల
రచన::పింగళి
గానం::ఘంటసాల, P.సుశీల
పల్లవి::
మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే
ఆ..మమతలు వెలెసెనులే..
మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే
ఆ..మమతలు వెలెసెనులే..
చరణం::1
ఇది చంద్రుని మహిమేలే అదంతేలే సరేలే మనకిది మంచిదిలే
ఇది చంద్రుని మహిమేలే అదంతేలే సరేలే మనకిది మంచిదిలే
ఆ..మంచిది అయినా కొంచెమైనా వంచన నీదేలే
ఆ..అయినా మంచిదిలే..
మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే
ఆ..మమతలు వెలెసెనులే..
చరణం::2
ఇది మోహన మంత్రమెలే అదంతేలే సరేలే మనకిది మేలేలే
ఇది మోహన మంత్రమెలే అదంతేలే సరేలే మనకిది మేలేలే
ఆ..మేలే అయినా మాల్యమైన జాలము నీదేలే
ఆ..అయినా మేలేలే..
మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే
ఆ..మమతలు వెలెసెనులే..
No comments:
Post a Comment