Monday, March 07, 2011

ప్రాణస్నేహితులు--1988




సంగీతం::రాజ్‌కోటి
రచన::
గానం::S.P.బాలు 

స్నేహానికన్న మిన్న..లోకాన లేదురా
స్నేహానికన్న మిన్న..లోకాన లేదురా 
కడ దాక నీడ లాగ..నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిది..నీ శ్వాసగా నిలిచేటిది 
ఈ స్నేహమొకటేనురా..
స్నేహానికన్న మిన్న..లోకాన లేదురా

తులతూగే సంపదలున్నా..స్నేహానికి సరిరావన్నా..ఓ..
పలుకాడే బంధువులున్నా..నేస్తానికి సరికారన్నా
మాయ మర్మం తెలియని చెలిమే..ఎన్నడు తరగని పెన్నిధిరా
ఆ స్నేహమే నీ ఆస్తి రా..నీ గౌరవం నిలిపేనురా
సందేహమే లేదురా..
స్నేహానికన్న మిన్న..లోకాన లేదురా
కడ దాక నీడ లాగ..నిను వీడి పోదురా

త్యాగానికి అర్ధం స్నేహం..లోభానికి లొంగదు నేస్తం..ఓ..
ప్రాణానికి ప్రాణం స్నేహం..రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది..నిర్మలమైనది స్నేహమురా
ధ్రువతారలా స్థిరమైనది..ఈ జగతిలో విలువైనది
ఈ స్నేహమొకటేనురా..
స్నేహానికన్న మిన్న..లోకాన లేదురా
కడ దాక నీడ లాగ..నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిది..నీ శ్వాసగా నిలిచేటిది 
ఈ స్నేహమొకటేనురా..

Prana Snehitulu (1988) 
Music::Raj-Koti
Singer::S.P.Balu
Cast::Krishnam Raju,Sharat Babu, Radha,MuralimOhan 

:::

Snehanikanna minaa lokana ledura
kada daaka needa laaga ninu veedi podura
nee gundelo poochetidi 
nee shwaasaga nilichetidi
ee snehamokatenu raa
Snehanikanna minaa lokana ledura

:::1

Thula thuge sampadalunna snehaaniki sariraavanna
palukaade bandhuvulanna nesthaaniki sarikaranna
maaya marmam theliyani chelime ennadu tharagani pennidira
aa snehame nee ashtira
nee gouravam nilipenura
sandehame ledu ra
Snehanikanna minaa lokana ledura
kada daaka needa laaga ninu veedi podura

:::2

Thyagaaniki artham sneham 
lobhaaniki longadu nestham..oo
praananiki pranam sneham 
rakthaaniki raktham nestham 
needi naadanu bedam lenidi
nirmalaminadi snehamu ra
druva thaarala sthiraminadi
ee jagathilo viluvainadi 
ee snehamokatenu ra
Snehanikanna minaa lokana ledura
kada daaka needa laaga ninu veedi podura
nee gundelo poochetidi 
nee shwaasaga nilichetidi

ee snehamokatenu raa

No comments: