Thursday, February 28, 2013

బంగారు మనిషి--1976






























సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::N.T. రామారావు,లక్ష్మి,అల్లురామలింగయ్య,
ప్రభాకరరెడ్డి,పండరీబాయి,రాజబాబు,రమాప్రభ   

:::

కలగన్నాను ఏదో కలగన్నాను నే కలగన్నాను
కలగన్నాను ఏదో కలగన్నాను నే కలగన్నాను
బ్రతుకే అనురాగమని..వలపే ఆనందమని 
కలగన్నాను ఏదో కలగన్నాను నే కలగన్నాను

మనసులలోని..మమకారాలు మారవనీ
మమతలలోని..మాధుర్యాలు మాయవని 
మనసులలోని..మమకారాలు మారవనీ
మమతలలోని..మాధుర్యాలు మాయవని 
కళకళలాడుతు..ఎపుడూ కలిసి మెలిసి ఉంటాయని

బ్రతుకే అనురాగమని వలపే ఆనందమని 
కలగన్నాను ఏదో కలగన్నాను నే కలగన్నాను

చిలక గోరింకల..చెలిమి చెదరదని
జాబిలీ తారలు..జతలు ఎన్నడు వీడవని 
చిలక గోరింకల..చెలిమి చెదరదని
జాబిలీ తారలు..జతలు ఎన్నడు వీడవని 
వలచిన హృదయాలెపుడూ కలిసిమెలిసి ఉంటాయనీ
బ్రతుకే అనురాగమని వలపే ఆనందమని 
కలగన్నాను ఏదో కలగన్నాను నే కలగన్నాను

అనుకున్నవి ఆశలుగానే మిగిలిననాడు
కలలన్ని కల్లలుగానే కరిగిననాడు 
అనుకున్నవి ఆశలుగానే మిగిలిననాడు
కలలన్ని కల్లలుగానే కరిగిననాడు 
నింగీ నేలా ఎపుడూ కలిసి మెలిసి ఉండవని

కలగన్నాను ఏదో కలగన్నాను నే కలగన్నాను నీకలగన్నాను

No comments: