సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
పల్లవి::
ఏకాంత వేళ..ఈ కాంత సేవ
ఏకాంత వేళ..కౌగిట్లో
ఈ కాంత సేవ..ముచ్చట్లో
పడుచమ్మ దక్కే..దుప్పట్లో
దిండల్లె ఉండు..నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై
ఏకాంత వేళ..కౌగిట్లో
ఈ కాంత సేవ..ముచ్చట్లో
ఏకాంత వేళా........
చరణం::1
ముద్దు సాగిన..ముచ్చట్లో
పొద్దు వాలదు..ఇప్పట్లో
ముద్దు సాగిన..ముచ్చట్లో
పొద్దు వాలదు..ఇప్పట్లో
కమ్ముకున్న ఈ కౌగిట్లో
కాటుకంటి..నా చెక్కిట్లో
నన్ను దాచుకో..నా ఒంట్లో
పడకు ఎప్పుడూ..ఏకంట్లో
నన్ను దాచుకో..నా ఒంట్లో
పడకు ఎప్పుడూ..ఏకంట్లో
ఆ చప్పట్లు..ఈ తిప్పట్లు
నా గుప్పెట్లోనే
ఏకాంత వేళ..కౌగిట్లో
ఈ కాంత సేవ..ముచ్చట్లో
పడుచమ్మ దక్కే..దుప్పట్లో
దిండల్లె ఉండు..నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై
ఏకాంత వేళ.......
చరణం::2
గుబులు చూపుల..గుప్పిట్లో
ఎవరు చూడని..చీకట్లో
గుబులు చూపుల..గుప్పిట్లో
ఎవరు చూడని..చీకట్లో
చిక్కబోములే..ఏకంట్లో
ఎదలు కలుపుకో..సందిట్లో
దేవుడొచ్చిన..సందట్లో
ఎదురులేదులే..ఇప్పట్లో
దేవుడొచ్చిన..సందట్లో
ఎదురులేదులే..ఇప్పట్లో
ఆ..చెక్కిట్లో
రా..కౌగిట్లో
మ్మ్..నిద్దట్లో
ఏకాంత వేళ..కౌగిట్లో
ఈ కాంత సేవ..ముచ్చట్లో
పడుచమ్మ దక్కే..దుప్పట్లో
దిండల్లె ఉండు..నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై
ఏకాంత వేళ..
No comments:
Post a Comment