Sunday, December 02, 2012

అందమైన అనుభవం--1979


సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::S.P.బాలు

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

చరణం::1

గతమును పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు కాలాలకు పందిళ్ళు వీళ్ళు
వీళ్లేనోయ్ నేటి మొనగాళ్ళు చెలిమికెపుడూ జతగాళ్ళు
చెడుపుకేపుడు పగవాళ్ళు వీళ్ళు వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

చరణం::2

అం..అం..అం

తళతళ మెరిసేటి కళ్లు నిగానిగాలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముళ్ళు
తీయాలోయ్ దాన్ని చేలివేళ్ళు
నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు
మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

చరణం::3

నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్ళు
దులిపేయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు
తెంచేసేయ్ పాతసంకేళ్ళు మనషులె మననేస్తాలు మనసులే మన కోవెలలు
come on clap..
మనషులె మననేస్తాలు మనసులే మన కోవెలలు 
మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్డులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..
come on everybody join together..

2 comments:

Anonymous said...

Everything is very open with a precise description of the
challenges. It was truly informative. Your site is very useful.
Many thanks for sharing!
Also see my web page :: Http://www.yourtobaccosstore.com/8-mac-baren

Anonymous said...

Quality articles is the important to invite the
people to pay a quick visit the site, that's what this website is providing.
Also see my web page: amber leaf