Monday, December 19, 2011

నమ్మినబంటు--1960::మోహన::రాగం







సంగీతం::S. రాజేశ్వరరావు 
రచన::కోసరాజు
గానం::Pసుశీల 

మోహన::రాగం

పల్లవి::

లక్ష్మి::చెంగు చెంగునా!!!...
చెంగు చెంగునా గంతులు వేయండి
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా 
చెంగు చెంగునా....
చెంగు చెంగునా గంతులు వేయండి

చరణం:;1

రంగురంగుల మోపురాలతో..రంకెలు వేసే రోజెపుడో
చెకచెకమంటూ అంగలువేసీ..నేలనుదున్నే అదనెపుడో
కూలిపోయినా సంసారానికి..గోగాకింతా పెట్టే దెపుడో
ఓ..ఓఓఓఓఓఓఓఓఓఓ.. ఓ..ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
కూలిపోయినా సంసారానికి..గోగాకింతా పెట్టే దెపుడో
ఆశలన్ని మీమీద బెట్టుకొని..తిరిగే మా వెత లణగే దెపుడో 

చెంగు చెంగునా గంతులు వేయండి

చరణం::2

పంచభక్ష్య పరమాన్నం తెమ్మని
బంతిని గూర్చుని అలగరుగా..
పట్టుపరుపులను వేయించండని..పట్టుబట్టి వేధించరుగా
గుప్పెడు గడ్డితో గ్రుక్కెడు నీళ్ళతో తృప్తిచెంది తలలూగిస్తారూ
జాలిలేని నరపశువుల కన్న..మీరే మేలనిపిస్తారూ 

చెంగు చెంగునా గంతులు వేయండి

చరణం::3

పగలనకుండా రేయినకుండా..పరోపకారం చేస్తారూ
వెన్నుగాచి మీ యజమానులపై విశ్వాసం జూపిస్తారూ
తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు..సంపద పెంచే జాతిరత్నములు
తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు..సంపద పెంచే జాతిరత్నములు
మా ఇలవేల్పులు మీరు లేనిదే..మానవజాతికి బ్రతుకే లేదు

చెంగు చెంగునా 
చెంగు చెంగునా గంతులు వేయండి
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా 
చెంగు చెంగునా గంతులు వేయండి

No comments: