సంగీతం::రమేష్ నాయుడు
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
పల్లవి::
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు
చరణం::1
మల్లెల కన్నీరు చూడు..మంచులా కురిసింది
లేత ఎండల నీడలలో నీ నవ్వే కనిపించింది
వేసారినా బాటలలొ..వేసవి నిట్టూర్పులలో
వేసారినా బాటలలొ..వేసవి నిట్టూర్పులలో
దొసిట నా ఆశలన్నీ..దోచి వెళ్ళిపొయావు
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు
చరణం::2
ప్రాణాలన్ని నీకై చలి వేణువైనాయీ
ఊపిరి ఉయాలూగే ఎదే మూగ సన్నాయి
ప్రాణాలన్ని నీకై చలి వేణువైనాయీ
ఊపిరి ఉయాలూగే ఎదే మూగ సన్నాయి
పసుపైనా కానీవా..పదాలంటుకొనీవా పాదాలకు
పారాణై పరవశించిపొనీవా..పలకరించిపొలెవా
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు
చరణం::3
వేకువంటి చీకటి మీద చందమామ జారింది
నీవు లేని వేదనలొనే నిశిరాతిరి నిట్టూర్చింది
తెల్లారని రాతిరిలా..వెకువలో వెన్నెలలా
తెల్లారని రాతిరిలా..వెకువలో వెన్నెలలా
జ్ణపకాల వెళ్ళువలోనే..కరిగి చెరిగి పొతున్నాను
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు
No comments:
Post a Comment