Sunday, October 21, 2012

రహస్యం--1967::సురటి::రాగం




సంగీతం::ఘంటసాల
రచన::మల్లాది రామకృష్ణశాస్త్రీ
గానం::P.లీల
సురటి::రాగం 
Film Director By::Vedantam Raghavaiah
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,కృష్ణకుమారి,C.H..నారాయణరావు,S.V.రంగారావు,
B.సరోజాదేవి,గుమ్మడి,రమణారెడ్డి,G.వరలక్ష్మి,రాజశ్రీ,కృష్ణకుమారి,కాంతారావు,చిత్తూరునాగయ్య, 

పల్లవి::

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా 
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

చరణం::1

జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ 
జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీవశమై స్మరణే జీవనమై 
మనసే నీవశమై స్మరణే జీవనమై
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

చరణం::2

అందరికన్న చక్కని తల్లికి సూర్యహారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళగా జ్యోతుల కప్పురహారతి
సకలనిగమ వినుతచరణ శాశ్వత మంగళహారతి
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

No comments: