Tuesday, July 10, 2012

ముత్యాల ముగ్గు--1975

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,P.సుశీల

తారాగణం::సంగీత,శ్రీధర్,కాంతారావు,ముక్కామల, అల్లు రామలింగయ్య,
రావు గోపాలరావు,హలం,సూర్యకాంతం

పల్లవి::

గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ
గోగులు దులిపే వారెవరమ్మా ఓ లచ్చా గుమ్మాడీ
గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ
గోగులు దులిపే వారెవరమ్మా ఓ లచ్చా గుమ్మాడీ
ఓ లచ్చా గుమ్మాడీ ఓ లచ్చా గుమ్మాడీ

పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ
పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చా గుమ్మాడీ
పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ
పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చా గుమ్మాడీ

పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా
పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా
వెలుగులు కావవి నీ పాదాలకు అలదిన పారాణి జిలుగులే సుమా

చరణం::1

ముంగిట వేసిన ముగ్గును చూడు ఓ లచ్చా గుమ్మాడీ
ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చా గుమ్మాడీ
ముంగిట వేసిన ముగ్గును చూడు ఓ లచ్చా గుమ్మాడీ
ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చా గుమ్మాడీ

ముంగిలి కాదది నీ అడుగులలో పొంగిన పాల కడలియే సుమా
ముంగిలి కాదది నీ అడుగులలో పొంగిన పాల కడలియే సుమా
ముగ్గులు కావవి నా అంతరంగాల పూచిన రంగవల్లులే సుమా

చరణం::2

మల్లెలు పూచే మల్లెలు పూచే ఓ లచ్చా గుమ్మాడీ
వెన్నెల కాచే వెన్నెల కాచే ఓ లచ్చా గుమ్మాడీ
మల్లెలు పూచే మల్లెలు పూచే ఓ లచ్చా గుమ్మాడీ
వెన్నెల కాచే వెన్నెల కాచే ఓ లచ్చా గుమ్మాడీ

మల్లెలు కావవి నా మహాలక్ష్మి విరజల్లిన సిరి నవ్వులే సుమా
మల్లెలు కావవి నా మహాలక్ష్మి విరజల్లిన సిరి నవ్వులే సుమా
వెన్నెల కాదది వేళ తెలిసి ఆ జాబిలి వేసిన పానుపే సుమా

Mutyala Muggu1975
Music::K.V.Mahadevan
Lyricis::C.Narayana Reddy
Singer's::S.P.Balu , P.Susheela

::::::::

gogulu puche gogulu kaache
oo lachchaa gummaadi
gogulu puche gogulu kaache
oo lachchaa gummaadi
gogulu dulipe varevaramma oo lachchaa gummaadi

poddu podiche poddu podiche oo lachchaa gummaadi
puttadi velugulu kottaga merise oo lachchaa gummaadi

poddu kaadadi ne muddu momuna
diddina tilakame sumaa
poddu kaadadi ne muddu momuna
diddina tilakame sumaa
velugulu kavavi ne padalaku
aladina paraani jilugule sumaa

::::1

mungita vesina muggulu chudu
oo lachchaa gummaadi
mutyala muggulu chudu
oo lachchaa gummaadi
mungili kadadi ne adugulalo
pongina pala kadaliye sumaa
muggulu kavavi na antarangaana
puchina rangavallule sumaa

::::2

mallelu puche mallelu puche
oo lachchaa gummaadi
vennela kaache vennela kache
oo lachchaa gummaadi
mallelu kavavi ma mahalakshmi

virajallina sirinavvule sumaa

No comments: