Friday, July 06, 2012

మట్టిలో మాణిక్యం--1971







సంగీతం::సత్యం
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల


పల్లవి::

నా మాటే నీ మాటై చదవాలి
నేనంటే నువ్వంటూ రాయాలి
నా మాటే నీ మాటై చదవాలి
నేనంటే నువ్వంటూ రాయాలి
అఅ ఈ ఈ ఉఉ ఎఎ
అఅ ఈ ఈ ఉఉ ఎఎ

చరణం::1

మట్టిలో రాసిన రాతలు గాలికి కొట్టుకుపోతే ఎట్టాగ? ఎట్టాగ?
మనసులో రాసి మననం చేస్తే జీవితం అంతా ఉంటాయి..నిలుచుంటాయి..

ఆ మాటే నిజమైతే నేర్పమ్మా..మనసంతా రాసేస్తా కోకమ్మ

నా మాటే నీ మాటై చదవాలి
నేనంటే నువ్వంటూ రాయాలి


పడవ..కడవ
చిలక..పలక

ఆహా..ఆహా..ఆహా..
ఓ..హో..

కొండలు కొనలు ఎం చదివాయి
కో అంటే అవి కో అంటాయి కో అంటాయి

హృదయలుండి కదిలయంటే..చదువులు చదవకే వస్తాయి..బదులిస్తాయి
ఆ చదువే నేనింకా చదవాలి..ఆ బదులే నీ నుంచి రావాలి

నా మాటే నీ మాటై చదవాలి
నేనంటే నువ్వంటూ రాయాలి
అహహా..హ్హా..హా..ఓ..
ఆ..ఆ..ఆ...ఆ..ఆ ఆ ఆ ఆ
ఓ..ఓ..హో..హో..

No comments: