సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల రామానుజాచార్య(జునియర్)
(సముద్రాల రాఘవాచార్యుల వారి కుమారుడు సముద్రాల రామానుజా చార్య)
గానం::P.లీల
పల్లవి::
లా..లా..లా..లా...లా.లా
లా..లా..లా..లా...లల్లల్లలా...లల్లల్లలలా
అందమే ఆనందం... అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...
అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...
చరణం::1
పడమట సంధ్యారాగం...కుడి ఎడమల కుసుమపరాగం...
పడమట సంధ్యారాగం...కుడి ఎడమల కుసుమపరాగం...
ఒడిలో చెలి తీయని రాగం...
ఒడిలో చెలి తీయని రాగం...
జీవితమే మధురానురాగం...
జీవితమే మధురానురాగం....
అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...
చరణం::2
చల్లని సాగరతీరం..మది ఝిల్లను మళయసమీరం...
చల్లని సాగరతీరం..మది ఝిల్లను మళయసమీరం...
మదిలో కదిలే సరాగం...మదిలో కదిలే సరాగం...
జీవితమే అనురాగ యోగం...జీవితమే అనురాగ యోగం..
అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...
No comments:
Post a Comment