Monday, May 07, 2012

బ్రతుకుతెరువు--1953



సంగీతం::సుబ్బరామన్ మరియు ఘంటసాల
రచన::సముద్రాల రామానుజాచార్య(జునియర్)
గానం::ఘంటసాల


పల్లవి::
అందమె ఆనందం...
అందమె ఆనందం...ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం...ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం...

చరణం::1

పడమటి సంధ్యారాగం...కుడి ఎడమల కుసుమపరాగం
పడమటి సంధ్యారాగం...కుడి ఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం...ఒడిలో చెలి మోహనరాగం...
జీవితమే మధురానురాగం...జీవితమే మధురానురాగం...
అందమె ఆనందం...ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం...

చరణం::2

పడిలేచే కడలితరంగం ఓ....ఓ ఓ ఓ..
పడిలేచే కడలితరంగం....వడిలో జడసిన సారంగం
పడిలేచే కడలితరంగం...వడిలో జడసిన సారంగం
సుడిగాలలో ఓ....సుడిగాలలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం...జీవితమే ఒక నాటకరంగం...
అందమె ఆనందం...ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం...ఓ ఓ ఓ...

No comments: