Monday, July 04, 2011

వివాహబంధం --- 1964




సంగీతం::M.B.శ్రీనివాసన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.భానుమతి

విన్నావా..ఆ..విన్నావా
మనసులోన దాగివున్న మధురగీతి విన్నావా
విన్నావా..ఆ..విన్నావా
మనసులోన దాగివున్న మధురగీతి విన్నావా
విన్నావా..ఓ..విన్నావా

తొలిచూపులు నా మదిలో తలుపు తీసెనే
తొలిచూపులు నా మదిలో తలుపు తీసెనే
పెదవులపై చిరునవ్వులు నిదురలేచెనే
పెదవులపై చిరునవ్వులు నిదురలేచెనే

విన్నావా..ఓ..విన్నావా
మనసులోన దాగివున్న
మధురగీతి విన్నావా
విన్నావా..ఆ..విన్నావా

తలుపులన్ని వేణువులై పిలువసాగెనే
తలుపులన్ని వేణువులై పిలువసాగెనే
హృదయమే యమునానదియై కదలసాగెనే
విన్నావా..ఆ..విన్నావా
మనసులోన దాగివున్న మధురగీతి విన్నావా
విన్నావా..ఓ..విన్నావా

అందరాని చందమామ ముందునిలిచెనే..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందరాని చందమామా ముందునిలిచెనే
అణువణువున వెన్నలలే ఆరబోసెనే...
విన్నావా..ఆ..విన్నావా
మనసులోన దాగివున్న మధురగీతి విన్నావా
విన్నావా..ఓ..విన్నావా

వలపులు విరజాజులుగా పరిమళించెనే
వలపులు విరజాజులుగా పరిమళించెనే
జగమే బృందావనియై సొగసులొలికెనే..
విన్నావా..ఓ..విన్నావా
మనసులోన దాగివున్న మధురగీతి విన్నావా
విన్నావా..ఆ..విన్నావా

No comments: