Wednesday, June 22, 2011

అంతా మన మంచికే--1972




సంగీతం::సత్యం
రచన::దాశరధి
గానం::SP.బాలు,P.సుశీల

ఓ...హో...హో..హో..
ఆఆఆహా..ఆఆహా...ఏహే...
నవ్వవే నా చెలీ..నవ్వవే నా చెలీ
చల్ల గాలి పిలిచేను..మల్లెపూలూ నవ్వేను
వలపులు పొంగే వేళలో......

నవ్వనా నా ప్రియా..మూడూ ముళ్ళూ పడగానే
తోడూ నీవూ కాగానే..మమతలు పండే వేళలో
నవ్వనా నా ప్రియా......

మనసులు ఏనాడొ కలిసాయిలే
మనువులు ఏనాడొ కుదిరాయిలే
నీవు నాదానవే..నీవు నా వాడవే
నేను నీ వాడ..నే నేను నీ దాననే
ఇక నను చేరి మురిపింప బెదురేలనే
నవ్వవే నా చెలీ..నవ్వనా నా ప్రియా

జగమేమి తలచేనొ..మనకెందుకూ
జనమేమి పలికేనొ..మనకేమిటీ
నేను నీ వాడనే..నేను నీ దాననే
నిజమైన మన ప్రేమ గెలిచేనులే

నవ్వవే నా చెలీ..నవ్వనా నా ప్రియా
సన్నగాలీ పిలిచేనూ..మల్లెపూలూ నవ్వేను
వలపులు పొంగే వేళలో..నవ్వవే నా చెలీ..నవ్వనా నా ప్రియా
ఎహెహేహే హే ఒహొ హో హో ఓ...

No comments: