Showing posts with label దేవుడే గెలిచాడు--1976. Show all posts
Showing posts with label దేవుడే గెలిచాడు--1976. Show all posts

Wednesday, November 30, 2011

దేవుడే గెలిచాడు--1976


చిమ్మటలోని మరో పాట వినండి
సంగీతం::రమేష్ నాయుడు
రచన::అప్పలాచార్య
డైరెక్టర్::By..విజయనిర్మల
గానం::S.P.బాలు,P.సుశీల

నటీ,నటులు::విజయనిర్మల,కృష్ణ,
అంజలిదేవి,గుమ్మడి,జగ్గయ్య.

:::


కృష్ణ:::పులకింతలు ఒక వేయీ
నిర్మల::కౌగిలింతలు ఒక కోటీ
ఇద్దరు::నిన్నుకలవమంటున్నవి
కృష్ణ:::మనసారా..పిలవమంటున్నవి
నిర్మల::మనసారా..పిలవమంటున్నవి
కృష్ణ:::రజనీ..నీ..
నిర్మల::విజయ్..విజయ్..
కృష్ణ:::రజనీ..నీ..
నిర్మల::విజయ్..విజయ్..

చరణం::1


నిర్మల::
నీ మగసిరి వడుపున వురవడిలో
నా సొగసుల పండుగ చేసేనూ
నీ కోర చూపుల వెచ్చదనంలో..
కోరిక నేనై మిగిలేనూ..
జన్మ జన్మలకు నిన్నే..
నిన్నే..ఏ..కొలిచేనూ..కొలిచేనూ..

కృష్ణ:::రజనీ..నీ..
నిర్మల::విజయ్..విజయ్..
కృష్ణ:::రజనీ..నీ..
నిర్మల::విజయ్..విజయ్..

చరణం::2


కృష్ణ::
నీ నవ్వులలో..విరజాజులు విరిసినవి
నీ కన్నులలో..సిరి మల్లెలు పూసినవి..ఈ..
ఎంత చూసినా..ఏమి చేసినా..తనివితీరనంటుంది
మనసు నిలివ నంటుంది..

కృష్ణ:::రజనీ..నీ..
నిర్మల::విజయ్..విజయ్..
కృష్ణ:::రజనీ..నీ..
నిర్మల::విజయ్..విజయ్..

చరణం::3


నిర్మల::
మనిషి పోయినా..మనసు మిగిలి ఉంటుంది

కృష్ణ::
ప్రేమించే గుణం..దాన్ని
వదలనంటుంది..వదల నంటుందీ

నిర్మల::మన కలలు పండీ
కృష్ణ:::మనసు నిండీ
ఇద్దరు::నింగి నేలా నిలిచేదాకా
నిలవాలీ..మన ప్రేమ నిలవాలీ

కృష్ణ:::పులకింతలు ఒక వేయీ
నిర్మల::కౌగిలింతలు ఒక కోటీ
ఇద్దరు::నిన్నుకలవమంటున్నవి
కృష్ణ:::మనసారా..పిలవమంటున్నవి
నిర్మల::మనసారా..పిలవమంటున్నవి
కృష్ణ:::రజనీ..నీ..
నిర్మల::లలల్లల్లాలలా
కృష్ణ:::రజనీ..నీ..
నిర్మల::లాలలలాలలా
కృష్ణ:::రజనీ..
నిర్మల::లాలల్లాలలలా
కృష్ణ:::రజనీ..
నిర్మల::లాలలాలలలా...

దేవుడే గెలిచాడు--1976


చిమ్మటలోని ఈపాట ఇక్కడ వినండి
సంగీతం::రమేష్ నాయుడు
రచన::జాలాది రాజారావ్
గానం::P.సుశీల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ
ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ
చెరిసగాల భావనలతో..యుగయుగాల దీవెనతో
రేపు మాపులాగా కలసి ఉందాము..కరిగిపోదాము..
కరిగిపోదాము..నాలో..నీలో..నాలో..నీలో..
నువ్వు నేనుగా మిగిలి పాడతాను..
పాడీఅడతాను..ఊ ఉ ఊ ఆ ఆ ఆ ఆ

ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ
ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ

చరణం::1
నిన్నటిలో నిజంలాగానే..రేపు తీపిగ ఉంటే
ఆ తీపిగుండె రాపిడిలో..ఊపిరిగామిగిలుంటే
చావని కోరికలాగే..పుడుతుంటాను
తిరిగిపుట్టి నీకోసమే..బ్రతికుంటాను

ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ
ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ

చరణం::2
నా జన్మకు ప్రాణం నీవై..నీ ప్రాణానికి ఆత్మను నేనై
కాలానికి ఇరుసువు నీవై..తిరుగాడే వలయం నేనై
ఎన్ని తరాలైనా..మరెన్ని యుగాలైనా
వీడని బంధాలై..కావ్యపు గంధాలై
నాలో..నీలో..నాలో..నీలో..
నువ్వు నేనుగా మిగిలి పాడతాను..పాడీఅడతాను
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ
ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ

Wednesday, May 25, 2011

దేవుడే గెలిచాడు--1976


సంగీతం::రమేష్‌నాయుడు 
Director::Vijaya Nirmala 
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య,అల్లు రామలింగయ్య, సూర్యకాంతం,రమాప్రభ 

పల్లవి::

గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ 
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
పాడే కోయిల నీదైతే కోయిల నీదైతే
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
పాడే కోయిల నీదైతే కోయిల నీదైతే

చరణం::1

పలకరించేదీ నా ప్రాయం
పులకరించేదీ నీ హృదయం 
పలకరించేదీ నా ప్రాయం
పులకరించేదీ నీ హృదయం 
నా లావణ్యం నీ ప్రణయం
నా లావణ్యం నీ ప్రణయం
కలిసే మంగళ సమయం
గంగా యమునల సంగమం
గంగా యమునల సంగమం
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
పాడే కోయిల నీదైతే..కోయిల నీదైతే

చరణం::2

మెరిసి మెరిసి తొలకరి జల్లై
కురిసి కురిసి వలపుల వానైనదీ 
మెరిసి మెరిసి తొలకరి జల్లై
కురిసి కురిసి వలపుల వానైనదీ
మురిసీ మురిసీ నాలోపలి నెమలి
పురివిప్పి నాట్యమాడిందీ నాట్యమాడిందీ
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
పాడే కోయిల నీదైతే
కోయిల నీదైతే కోయిల నీదైతే