Thursday, March 24, 2011

ప్రేమలేఖలు--1977

సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::రామకృష్ణ, సుశీల
తారాగణం::మరళీమోహన్,అనంతనాగ్,సత్యనారాయణ,జగ్గయ్య,జయసుధ,దీప,
అల్లు రామలింగయ్య

పల్లవి::

ఈనాటి విడరాని బంధం..మనకేనాడో వేశాడు దైవం
ఈనాటి విడరాని బంధం..నేను ఏనాడో చేసిన పుణ్యం
అ..హ..హ..అహ..ఆ..ఆ
ఆ..హా..ఆహ..ఆహ..ఆ

చరణం::1

నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే
నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే
నాలోని ప్రేమ నీ పాద సీమా విరిసింది సిరిమల్లెగా

ఈనాటి విడరాని బంధం..నేను ఏనాడో చేసిన పుణ్యం

చరణం::2

సొగసెంతొ కలిగే సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే
సొగసెంతొ కలిగే సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే
మదిలోన దాచి.. మనసార వలిచి..పతి నీడ దొరికిందిలే

ఈనాటి విడరాని బంధం..నేను ఏనాడో చేసిన పుణ్యం

Prema Lekhalu--1977
Music::Satyam
Lyrics::Dasarathi
Singer's::Ramakrishna,P.Suseela

No comments: