Friday, October 28, 2011

మంగమ్మ శపధం--1965



సంగీతం::T.V.రాజు
రచన::సినారె
గానం::P.సుశీల

పల్లవి::

రివ్వున సాగే...రెపరెపలాడే యవ్వనమేమన్నదీ
పదే పదే సవ్వడి చేస్తున్నదీ
రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ
పదే పదే సవ్వడి చేస్తున్నదీ
రివ్వున సాగే...

చరణం::1

పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
సొగసైనా బిగువైనా ...నాదే నాదే

రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ
పదే పదే సవ్వడి చేస్తున్నదీ
రివ్వున సాగే...

చరణం::2

నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
జగమంతా అగుపించెద ...నేనే నేనే

రివ్వున సాగే...రెపరెపలాడే యవ్వనమేమన్నదీ
పదే పదే సవ్వడి చేస్తున్నదీ
రివ్వున సాగే...

చరణం::3

నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా
నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా
నేనన్నది కాలేనిది ...ఏదీ ఏదీ ...

రివ్వున సాగే...రెపరెపలాడే యవ్వనమేమన్నదీ
పదే పదే సవ్వడి చేస్తున్నదీ
రివ్వున సాగే...

No comments: