Friday, October 28, 2011

మంగమ్మ శపథం--1965




సంగీతం::TV.రాజు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,p.సుశీల

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ....
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను
ఈ రేయి నీదే కదా...
చెలి నా రాణి నీవే కదా

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నా రాజు పిలిచెను రేరాజు నిలిచెను
ఈ రేయి నాదే కదా...
ఇక నీ రాణి నేనే కదా

నిన్ను చూచి నీ వన్నె చూచి
నను నేనే మరచేనులే
నను నేనే మరచేనులే
ఈ నాటికైనా ఏ నాటికైనా
ఈ నాటికైనా ఏ నాటికైనా
నేనె నీలొ నిలిచేనులే..

నీ రాజు పిలిచెను రేరాజు పలికెను
ఈ రేయి నీదే కదా...
చెలి నా రాణి నీవే కదా

ఇన్ని నాళ్ళు ఈనీలి కళ్ళు
ఏ కోనలో దాగెనో..ఏ కోనలో దాగెనో
నే కోరుకున్న నా స్వామి కోసం
నే కోరుకున్న నా స్వామి కోసం
ఈ కళ్ళు ఇన్నాళ్ళు వేచేనులే..

నీ రాజు పిలిచెను రేరాజు పలికెను
ఈ రేయి నీదే కదా...
చెలి నా రాణి నీవే కదా

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నా రాజు పిలిచెను రేరాజు నిలిచెను
ఈ రేయి నాదే కదా...
ఇక నీ రాణి నేనే కదా

అహహా..అహహా..అహహా..అహహా..

No comments: