Thursday, September 02, 2010

అమరజీవి--1983





సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

Film Directed By::Jandyaala
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,జయప్రద,పండరిబాయి,సుమలత,శరత్‌బాబు,నరసింహరాజు,శ్రీలక్ష్మీ,నాగేష్  

:::::::::::::::::

ఓదార్పుకన్న..చల్లనిది
నిట్టూర్పుకన్న..వెచ్చనిది
గగనాలకన్న..మౌనమిది
అర్చనగా..ద ద ద ని
అర్పనగా..ని ద ని స
దీవెనగా..లాలనగా
వెలిగే ప్రేమ...


ఓదార్పుకన్న..చల్లనిది
నిట్టూర్పుకన్న..వెచ్చనిది
గగనాలకన్న..మౌనమిది
అర్చనగా..ద ద ద ని
అర్పనగా..ని ద ని స
దీవెనగా..లాలనగా
వెలిగే ప్రేమ..

::::1


వేదాలకైన..మూలమది
నాదాలలోన..భావమది
దైవాలకైన..ఊయ్యలది
కాలాలకన్న..వేదమది
కన్నీళ్ళు మింగి..బ్రతికేది
అదిలేనినాడు..బ్రతుకేది
నీకై..జీవించి
నిన్నే..దీవించి
నీకై..మరణించు
జన్మజన్మల..ఋణమీ ప్రేమ

ఓదార్పుకన్న..చల్లనిది
నిట్టూర్పుకన్న..వెచ్చనిది
గగనాలకన్న..మౌనమిది
అర్చనగా..ద ద ద ని
అర్పనగా..ని ద ని స
దీవెనగా..లాలనగా
వెలిగే ప్రేమ..

::::2


లయమైన సృష్టి..కల్పములో
చివురించు లేత..పల్లవిది
గతమైనగాని..రేపటిది
అమ్మలుగన్న..అమ్మ ఇది
పూలెన్ని..రాలిపోతున్నా
పులకించు..ఆత్మగంధమిది
నిన్నే..ఆశించి
నిన్నే..సేవించి
కలలె..అర్పించు
బ్రతుకు చాలని..బంధం ప్రేమ

ఓదార్పుకన్న..చల్లనిది
నిట్టూర్పుకన్న..వెచ్చనిది
గగనాలకన్న..మౌనమిది
అర్చనగా..ద ద ద ని
అర్పనగా..ని ద ని స
దీవెనగా..లాలనగా
వెలిగే ప్రేమ..

2 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మంచి పాటను గుర్తు చేశారు. ధన్యవాదాలండి.

srinath kanna said...

HEY mandaakinii....

bahukaala darsanam itupakka raavatame ledu?/