http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4651
సంగీతం::S.హనుమంతరావ్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::V.రామకృష్ణ,P.సుశీల,బసవేశ్వర్,లత.
తారాగణం::చలం,రామకృష్ణ,సుమ,మమత,మిక్కిలినేని,గిరిజ,నిర్మల,జయమాలిని
పల్లవి::
తొలిరేయిలో పులకింతలో..తుదిలేని రుచివున్నదీ
వలపుల ఒడిలోన..తొలకరి వయసే
ఆడినదీ..ఆహా..పాడినదీ..ఓహో..
ఆడినదీ..ఈ..ఆహా..పాడినదీ..ఈ
తొలిరేయిలో పులకింతలో..తుదిలేని రుచివున్నదీ
వలపుల ఒడిలోన..తొలకరి వయసే
ఆడినదీ..ఆహా..పాడినదీ..ఓహో..
ఆడినదీ..ఈ..ఆహా..పాడినదీ..ఈ
చరణం::1
నయనాలు నయనాలు..మాటాడగా..ఆ
అధరాలు అధరాలు...వేటాడగా..ఆ
నయనాలు నయనాలు..మాటాడగా
అధరాలు అధరాలు...వేటాడగా
కనరానీ సెగలన్నీ..కనరానీ సెగలన్నీ
తనువెల్ల...చెలరేగిపోగా..ఆఆ
తొలిరేయిలో పులకింతలో..తుదిలేని రుచివున్నదీ
వలపుల ఒడిలోన...తొలకరి వయసే
ఆడినదీ..ఆహా..పాడినదీ..ఆహా
చరణం::2
నీ చేయి నా చేయి...చెరలాడగా
నీ మేను నా మేను..జతగూడగా
జడలోని పూలన్నీ..జడలోని పూలన్నీ
తలగడపై...నవ్వుకోగా..ఆఆ
చరణం::3
తొలిజాము నిలువెల్ల కరిగించగా
మలిజాము మరికాస్త కవ్వించగా
తొలిజాము నిలువెల్ల కరిగించగా
మలిజాము..మరికాస్త కవ్వించగా
అంతలోనే వింతగానే..అంతలోనే వింతగానే
అమ్మమ్మొ...తెలవారిపోగా..ఆ
తొలిరేయిలో...పులకింతలో
తుదిలేని...రుచివున్నదీ..ఈ
వలపుల ఒడిలోన..తొలకరి వయసే
ఆడినదీ..ఆహా..పాడినదీ..ఓహో
ఆడినదీ..పాడినదీ
No comments:
Post a Comment