Friday, July 01, 2011
రాముడు కాదు కృష్ణుడు--1983
సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి
గానం::SP.బాలు,P.సుశీల
ఒక సంధ్యా సమయాన..దిక్కుతోచక నే దిక్కులన్ని చూచుచుండ
ఉత్తర దిక్కున మెరిసెనొక తారక..అది తారకో..మేనకో..నా అభిసారికో..
చూసాకా నిను చూసాకా..చూసాకా నిను చూసాకా..
ఆగలేక..మనసాపుకోలేకా..రాసాను ఒక లేఖ
అందుకో ఈ ప్రేమలేఖా..అందించు శుభలేఖ
చూసాక నిను చూసాక..
అందమంతా ఏర్చి కూర్చి అక్షరాలుగ పేర్చినాను
అందమంతా ఏర్చి కూర్చి అక్షరాలుగ పేర్చినాను
మనసులోనికి తొంగి చూసి భావమంతా కూర్చినాను
మనసులోనికి తొంగి చూసి భావమంతా కూర్చినాను
నీ కనులలో..నా కనులు కలిపినానూ
నీ అడుగులో..నా అడుగువేసినానూ
ఈ ఉత్తరం..నా జీవితం..నీ సంతకం..నా జాతకం
చూసాకా నిను చూసాకా..
ఆగలేక..మనసాపుకోలేకా..రాసాను ఒక లేఖ
అందుకో ఈ ప్రేమలేఖా..అందించు శుభలేఖ
భావమంతా మార్చి మార్చి..భారతం లా చదువుకున్నా
భావమంతా మార్చి మార్చి..భారతం లా చదువుకున్నా
బరువుగుండెల రాత చూసి..బాధనంతా పోల్చుకున్నా
బరువుగుండెల రాత చూసి..బాధనంతా పోల్చుకున్నా
నీ చూపులో..నా రూపు చూసినానూ
నా గుండెలో..నీ మూర్తి నిలిపినానూ
ఈ మాటలే నా ఉత్తరం..ఈ పిలుపులే నా సంతకం ..
చూసాకా నిను చూసాకా..చూసాకా నిను చూసాకా..
ఆగలేక..మనసాపుకోలేకా..చూసాను నీ లేఖ
చదివాలే చివరిదాకా..పంపిస్తా శుభలేఖ
చూసాకా నిను చూసాకా..చూసాకా నిను చూసాకా..
ఆగలేక..మనసాపుకోలేకా..
రాసాను ఒక లేఖ..చూసాను ఆ లేఖ
Labels:
Hero::A.N.R,
P.Suseela,
SP.Baalu,
రాముడు కాదు కృష్ణుడు--1983
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment