Tuesday, April 12, 2011

గాలిమేడలు--1962



సంగీతం::T.G.లింగప్ప
రచన::సముద్రాల రాఘవాచార్య( సీనియర్)
గానం::ఘంటసాల

తారాగణం::N.T.రామారావు,దేవిక,S.V.రంగారావు,జగ్గయ్య,నాగయ్య,రమణారెడ్డి,
M.V.రాజమ్మ,రాజనాల

::::::

మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో

::::1

ఏ కులమైనా నెలవేది ఐనా
మదిలో కూరిమి జాలుకొన
ఏ కులమైనా నెలవేది ఐనా
మదిలో కూరిమి జాలుకొన
పిలిచి లాలించి కొడుకు తందాన
పిలిచి లాలించి కొడుకు తందాన
చూచి కాచే దాటే నాయన కాదా

మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో...

::::2

మాటలు నమ్మి మనసు నీరై
దరికి తీసిన తండ్రులను
మాటలు నమ్మి మనసు నీరై
దరికి తీసిన తండ్రులను
దేవుని సంద్రాన తలచి పూజించి
దేవుని సంద్రాన తలచి పూజించి
కొలువుచేసేవాడే కొడుకవుగాదా

మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో...
ఆఆఆఆఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

No comments: