Friday, December 10, 2010

విచిత్ర వివాహం--1973::ఆనందభైరవి::రాగం


 
సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::కోవెల శాంత
తారాగణం::P.భానుమతి,గుమ్మడి,చంద్రమోహన్,పద్మనాభం,రమాప్రభ,ప్రమీల,రామకృష్ణ,రాజబాబు.
ఆనందభైరవి::రాగం 

పల్లవి::

చిలకమ్మపాటా..కాకమ్మ నోటా
వింటావా గోరింకా..ఆ..విని చూస్తావా నా వంకా..అ
చిలకమ్మపాటా..కాకమ్మ నోటా
వింటావా గోరింకా..ఆ..విని చూస్తావా నా వంకా..అ

చరణం::1

కాకమ్మ నోటికి..యీ దొండపండూ..ఊ
కాకమ్మ నోటికి..యీ దొండపండూ 
ఏ బాబు చేతికో..ఆ పూలచెండూ
ఆ బ్రహ్మ చేసిన..తిరకాసు చూడూ 
ఏమేమో చేస్తాడూ..తను ఏదేదో రాస్తాడూ 
చిలకమ్మపాటా..కాకమ్మ నోటా
వింటావా గోరింకా..ఆ..విని చూస్తావా నా వంకా..ఆ

చరణం::2

నీకన్న నాకు..వేరెవరు లేరూ..ఊ
నీకన్న నాకు..వేరెవరు లేరూ
కాదన్నావంటే..కథ తారుమారూ
ఆ బ్రహ్మచేసిన..తిరకాసు చూడూ
ఏమేమో చేస్తాడూ తను ఎదేదో రాస్తాడూ 
చిలకమ్మపాటా...కాకమ్మ నోటా
వింటావా గోరింకా..ఆ..విని చూస్తావా నా వంకా..ఆ

No comments: