Thursday, June 03, 2010

పెళ్ళికాని పిల్లలు--1961




సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,ఘంటసాల

తారాగణం::జగ్గయ్య,జమున,కాంతారావు,చలం,హరనాధ్,రామకృష్ణ,పద్మనాభం.

పల్లవి::

చల్లని గాలి చక్కని తోట
పక్కన నీవుంటే పరవశమేకదా
చల్లని గాలి చక్కని తోట
పక్కన నీవుంటే పరవశమేకదా

చరణం::1

అందాల నీ ఓరచూపులు
నను బంధించు బంగారు గొలుసులు
అందాల నీ ఓరచూపులు
నను బంధించు బంగారు గొలుసులు

నీ చిరునవ్వులే జాబిలి రేకలు
నీ చిరునవ్వులే జాబిలి రేకలు
వికసించెను నా వలపులు..లేతలుపుల కలువలు

చల్లని గాలి చక్కని తోట
పక్కన నీవుంటే పరవశమేకదా

చరణం::2

ఈ రేయి ఈ హాయి మరువకు
నా చేయి ఏ నాడు విడువకు
ఈ రేయి ఈ హాయి మరువకు
నా చేయి ఏ నాడు విడువకు

నా అనురాగమే కమ్మని తుమ్మెద
నా అనురాగమే కమ్మని తుమ్మెద
నను పిలిచేను మరపించేను..నీ సొగసుల పూలు


చల్లని గాలి చక్కని తోట
పక్కన నీవుంటే పరవశమేకదా

చల్లని గాలి చక్కని తోట
పక్కన నీవుంటే పరవశమేకదా

No comments: