Sunday, December 20, 2009

భక్త కన్నప్ప--1976::మారు బిహాగ్::రాగం

చిమ్మటలోని ఈ ఆణి ముత్యం వింటూ--సాహిత్యాన్ని చూస్తూ పాడుకొందామా



సంగీతం::ఆదినారాయణ రావ్,సత్యం
రచన::వేటూరి
గానం::S.జానకి

(హిందుస్తాని~కర్నాటక)
రాగం:::మారు బిహాగ్


శివ శివ అననేలరా
శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాసమందగా
కౌగిలిలో నే కైలాసమీయగా
శివ శివ అననేలరా

కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి
కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి
భక్తులకో బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి
భక్తులకో బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి
మనబోటి రక్తులకు ఘడియ ఘడియకు ముక్తి శివ శివా

శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాసమందగా
కౌగిలిలో నే కైలాసమీయగా
శివ శివ అననేలరా రా

టక్కరి మరుని ముక్కడగించెను నాటి ముక్కంటి చూపు
కాలిన మదనుని మేలుకొలిపెను నేటి నీ కొంటె చూపు
టక్కరి మరుని ముక్కడగించెను నాటి ముక్కంటి చూపు
కాలిన మదనుని మేలుకొలిపెను నేటి నీ కొంటె చూపు
సగము మేనిలో మగువను నిలిపిన
సగము మేనిలో మగువను నిలిపిన చంద్రధరుడు ఆ హరుడు
తనువు తనువునే మరునికొసగిన రసికవరుడు ఈ హరుడు శివ శివా

శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాసమందగా
కౌగిలిలో నే కైలాసమీయగా
శివ శివ
శివ శివ అననేల రా రా

No comments: