Thursday, December 17, 2009

జీవనపోరాటం--1986



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల


హ్హా..హా..హ్హా..హా..హా..ఆ..ఆ..
మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం
ఈ...మధుమాసం..మనకోసం..
ప్రేమ పల్లవించి పూలుపూసే..కౌగిలింతలో..
సంతకాలు చేసిపోయే జీవితాలలో..
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం

ఆమని తేనెలు పోంగేవేళల్లో..ప్రేమని కోయిల పాడేవేళల్లో
పోంగే..గంధాలు..పూసి..నాలో ప్రాణాలుపోసి
కుంకుమ వీణల సంధ్యరాగమే..పండిన ప్రేమకు తాంబూలమై
మూగచూపులల్లుకొంది...రాగమిప్పుడే..
కన్నెగుండె చేరుకొంది...తాళమెప్పుడో
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం

రేపటి చల్లటి వెలుగు నీడల్లో..
నిన్నటి సన్నటి వెన్నల జాడల్లో
నీవే..నేనైన వేళా..మాటే..మూగైన వేళా..
తోటకి వేసవి రానే రాదులే..పాటా..పల్లవి..నీవూ నేనులే
జాజిపూల మాలలంటి జ్ఞాపకాలలో..
పూవులార దూసుకొన్న జీవితాలలో..
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం
ఈ...మధుమాసం..మనకోసం..
ప్రేమ పల్లవించి పూలుపూసే..కౌగిలింతలో..
సంతకాలు చేసిపోయే జీవితాలలో..
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం
హ్హా..హా..హ్హా..హా..హ్హా...హ్హా..హా..ఆ..ఆ..

No comments: