Thursday, November 26, 2009

సంపూర్ణ రామాయణం--1973::యదుకుల కాంభోజి::రాగం






సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజు
గానం::ఘంటసాల


రాగం:::యదుకుల కాంభోజి
పహడి..హిందుస్తానీ రాగం)


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: 


రామయ్య తండ్రీ ఓ రామయ్య తండ్రీ
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ్య తండ్రి 


రామయ్య తండ్రీ ఓ రామయ్య తండ్రీ
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ్య తండ్రి

చరణం::1


తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిసావంట
తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిసావంట
పరశురాముడంతవోణ్ణి పార తరిమినావంట
ఆ కతలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట

రామయ్య తండ్రీ ఓ రామయ్య తండ్రీ
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ్య తండ్రి


చరణం::2

ఆగు బాబు ఆగు
అయ్యా నే వస్తుండా బాబూ నే వస్తుండా 

అయ్యా నే వస్తుండా బాబూ నే వస్తుండా
నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట
మాకు తెలుసులే
నా నావ మీద కాలు బెడితే ఏమౌతాదో తంటా 

నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట
నా నావ మీద కాలు బెడితే ఏమౌతాదో తంటా
దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణమూర్తివంట

రామయ్య తండ్రీ ఓ రామయ్య తండ్రీ
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ్య తండ్రి


చరణం::3

అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ జేర్చమని అడుగుతుండావే

అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ జేర్చమని అడుగుతుండావే
నువ్వు దాటలేక కాదులే తామయ్య తండ్రి 

నువ్వు దాటలేక కాదులే తామయ్య తండ్రి
నన్ను దయచూడగ వచ్చావూ రామయ్య తండ్రి

హైలేస్సా....రేలో హైలేస్సా
హైలేస్సా....రేలో హైలేస్సా
హైలేస్సా....రేలో హైలేస్సా
హైలేస్సా....రేలో హైలేస్సా

హైలేస్సా....రేలో హైలేస్సా
హైలేస్సా....రేలో హైలేస్సా


No comments: