Thursday, November 26, 2009

స్నేహ బంధం--1973



















ఈ పాట ఇక్కడ వినవచ్చు

సంగీతం::సత్యం
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల,జి ఆనంద్ 

తారాగణం::కృష్ణ,జమున,కృష్ణం రాజు,గుమ్మడి,రమాప్రభ,రాజబాబు,సత్యనారాయణ 



స్నేహబంధమూ ఎంతమధురమూ
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతమూ

ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో
ఒకటే దొరుకుతుంది జీవితంలో
అది ఓడిపోదు వాడిపోదు కష్టసుఖాల్లో

స్నేహబంధమూ ఎంత మధురమూ
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

మల్లెపూవు నల్లగ మాయవచ్చును
మంచు కూడ వేడి సెగలు ఎగయవచ్చును
పువ్వు బట్టి తెనె రుచె మారవచ్చును
చెక్కుచెదరందె స్నేహమని నమ్మవచ్చును

స్నేహబంధమూ ఎంత మధురమూ
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

No comments: