Showing posts with label కురుక్షేత్రం--1977. Show all posts
Showing posts with label కురుక్షేత్రం--1977. Show all posts

Monday, June 01, 2009

కురుక్షేత్రం--1977


సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ,P.సుశీల


పల్లవి::

సంధ్యకెంజాయలో..ఓ..ఓ..
సరసాల సరసి దరినీ...
కలిసినవి..ఇరుకన్నులూ..మెరిసినవి
పలు వన్నెలు..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

హరివిల్లు దివినుండి దిగివచ్చేనేమో
హరివిల్లు దివినుండి దిగివచ్చేనేమో
ప్రణయాల విరిజల్లు కురిపించెనేమో
మురిపించెనేమో..మైమరపించేనేమో
హరివిల్లు దివినుండి దిగివచ్చేనేమో

చరణం::1

విరియని విరిజాజులు..నా వలపులా లేతలుపులు
విరియని విరిజాజులు..నా వలపులా లేతలుపులు
పెదవుల ధరహాసమూ..నే దాచితీ నీ కోసమూ
నీ కథలు విన్నాను..చిననాటి నుంచి
నీ కలలు కన్నాను..అనురాగమెంచి

హరివిల్లు దివినుండి దిగివచ్చెనేమో
ప్రణయాల విరిజల్లు..కురిపించెనేమో
మురిపించెనేమో..మైమరపించెనేమో

చరణం::2

నునుసిగ్గు చెలరేగి..పులకింతలాయే
తొలిప్రేమ మురిపాలు..చిగురింతలాయే

హరివిల్లు దివినుండి దిగివచ్చెనేమో
ప్రణయాల విరిజల్లు..కురిపించెనేమో
మురిపించెనేమో..మైమరపించెనేమో
హరివిల్లు దివినుండి దిగివచ్చెనేమో




కురుక్షేత్రం--1977::::నటశేఖర క్రిష్ణ గారికి 65వ జన్మదిన శుభాకాంక్షలు









నటశేఖర క్రిష్ణ గారికి 65వ జన్మదిన శుభాకాంక్షలు

కురుక్షేత్రం--1977
సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల


::::::::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆహహా....
మ్రోగింది కల్యాణవీణా..మ్రోగింది కల్యాణవీణా
నవమోహన జీవన మధువనిలోనా..ఆ.ఆ.ఆ
మ్రోగింది కల్యాణవీణా..
ఆ ఆ ఆ..మ్రోగింది కల్యాణవీణా..
నవమోహన జీవన మధువనిలోనా..ఆ.ఆ.ఆ
మ్రోగింది కల్యాణవీణా..మ్రోగింది కల్యాణవీణా

పిల్లగాలితో..నే నందించిన..పిలుపులే విన్నావో
నీలి మబ్బుపై నే లిఖియించిన లేఖలందుకొన్నావో

ఆ లేఖలే వివరించగా..రసరేఖలే ఉదయించగా
ఆ లేఖలే వివరించగా..రసరేఖలే ఉదయించగా
కలవరించి..కలవరిచి..కలవరించి..కలవరించి
పులకిత తనులత..నినుచేరుకోగా..ఆ..ఆ
మ్రోగింది కల్యాణవీణా..మ్రోగింది కల్యాణవీణా

మస్చ్త్తకోకిలలు ముత్తైదువులై..మంగళగీతాలు పాడగా
మయూరాంగనలు ఆటవెలగులై..లయలహరులపై.. ఆడగా
నా యోగమే..ఫలియించగా..ఆ దైవమే..కరుణించగా
నా యోగమే..ఫలియించగా..ఆ దైవమే..కరుణించగా
సుమశరుడే..పురోహితుడై..సుమశరుడే..పురోహితుడై
శుభ ముహూర్తమే..నిర్ణయించగా..ఆ..ఆ..ఆ
మ్రోగింది కల్యాణవీణా..మ్రోగింది కల్యాణవీణా
నవమోహన జీవన మధువనిలోనా..ఆ.ఆ.ఆ
మ్రోగింది కల్యాణవీణా..మ్రోగింది కల్యాణవీణా