Tuesday, May 26, 2009

కధానాయకుడు--1969

సంగీతం::T.V.రాజు
రచన::కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం::ఘంటసాల,P.సుశీల

బలె భలె భలె భల్లే....
హ్హ హ్హ హ్హ హ్హ ఓ..ఓ..ఓ..ఓ..
హ్హ హ్హ హ్హ హ్హ ఓ..ఓ..ఓ..ఓ..

వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
మన మంటే గెలిచిందయ్య..మన మాటే నిలిచిందయ్యా
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య

అపద్దాలు చెప్పెవారు..అన్యాయం చేసేవారు
అపద్దాలు చెప్పెవారు..అన్యాయం చేసేవారు
చిత్తు చిత్తుగా వోడారయ్య..నెత్తికి చేతులు వచ్చినవయ్య

వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
మన మంటే గెలిచిందయ్య..మన మాటే నిలిచిందయ్యా
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య

మహా నాయకులు త్యాగంచేసి.. మనకిచ్చిన స్వాత్రంత్యం
మహా నాయకులు త్యాగంచేసి.. మనకిచ్చిన స్వాత్రంత్యం
కొందరి చేతుల పడనీకుండ..అందరు పొమ్మని చెప్పాలి

వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
మన మంటే గెలిచిందయ్య..మన మాటే నిలిచిందయ్యా
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య

నిరుపేదలని ప్రేమించే వారను..నిజాయితీగా నడచేవారును
నిరుపేదలని ప్రేమించే వారను..నిజాయితీగా నడచేవారును
పదవి వచ్చి వలచిందయ్యా..జయలక్ష్మి వరించినదయ్యా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
మన మంటే గెలిచిందయ్య..మన మాటే నిలిచిందయ్యా
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య

దగాకోరులౌ దోపిడి దొంగలు..తల్లకిందలౌతారయ్యా
దగాకోరులౌ దోపిడి దొంగలు..తల్లకిందులౌతారయ్యా
నీతికి నిలబడు కథానాయకులు..జాతికి ప్రాణం పోసేరయ్యా

వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
మన మంటే గెలిచిందయ్య..మన మాటే నిలిచిందయ్యా
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య

No comments: