సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం:: ఘంటసాల,P.సుశీల
అందాలా శ్రీమతికీ మనసైనా ప్రియసతికి
వలపుల కానుకగా..ఒక పాపను నేనివ్వనా
మబ్బులలో..విహరించే..మావారీ అనురాగం
వాడని మందారం..నా పాపిట సింధూరం..
మా బాబు నయనాలూ..లేత జాబిల్లి కిరణాలు..
మా బాబు నయనాలూ..లేత జాబిల్లి కిరణాలు
వీడే..ఇంతవాడై..అంతవాడై..వెలుగుతాడూ..
వీడే..ఇంతవాడై..అంతవాడై..వెలుగుతాడూ
కలలు నిండారగా..సిరులుపొంగారగా..
అందాలా శ్రీమతికీ మనసైనా ప్రియసతికి
వలపుల కానుకగా..ఒక పాపను నేనివ్వనా
మబ్బులలో..విహరించే..మావారీ అనురాగం
వాడని మందారం..నా పాపిట సింధూరం
సౌర్యంలో..నేతాజీ..
శరణంలో..గాంధిజీ..
శాంతిగుణంలో నెహౄజీ..
శాంతిగుణంలో నెహౄజీ..
సాహసంలో శాస్త్రిజీ..
ఒరవడిగా..వడివడిగా..
నీ నడవడి తీర్చి దిద్దుకొనీ..
ఒరవడిగా..వడివడిగా..
నీ నడవడి తీర్చి దిద్దుకొనీ..
సరిహద్దులలో పొంచిన ద్రోహుల
తరిమి తరిమి కొట్టాలీ..
వీరసైనికుడవై భరతావని..పేరును నిలబెట్టాలీ
వందేమాతరం..వందేమాతరం.. వందేమాతరం..
No comments:
Post a Comment