Wednesday, May 13, 2009

సీతా రాములు ~~ 1980



సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ
గానం::SP.బాలు,P.సుశీల


హేయ్..బుంగమూతి బుల్లెమ్మా..దొంగచూపు చూసింది
అహా..బుంగమూతి బుల్లెమ్మా..దొంగచూపు చూసింది
ఆ చూపులో ఏదో సూదంటూరాయి..అబ్భా..
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ

కోడెకారు చిన్నోడు..చేతిలో చెయ్ ఏసాడు..
కోడెకారు చిన్నోడు..చేతిలో చెయ్ ఏసాడు..
ఆ చేతిలో ఏముందో..ఆకురాయి..అబ్భా..
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ

మరుమల్లె తీగలాగ..నిలువెల్లా చుట్టేస్తుంది
అణువణువు నాలో నిండీ..మనసంతా పండిస్తుందీ
మనసులో ఏముందో అంత గారం..నన్ను..
కొరుక్కొ..కొరుక్కొ తింటుంది..ఆశింగారం..ఓ..
కొరుక్కొ..కొరుక్కొ తింటుంది..ఆశింగారం

వద్దన్న ఊరుకోడు..కలలోకి వచ్చేస్తాడు
మొగ్గలంటి బుగ్గలమీద..ముగ్గులేసి పోతుంటాడు
ముచ్చటలో ఏముందో చెప్పలేను..అబ్భా..
ఉలిక్కి ఉలిక్కి పడుతుంటాను నాలో నేనూ..
ఉలిక్కి ఉలిక్కి పడుతుంటాను నాలో నేనూ..

అహా..బుంగమూతి బుల్లెమ్మా..దొంగచూపు చూసింది
ఆ చూపులో ఏదో సూదంటూరాయి..అబ్భా..
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ..అహా
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ

చుక్కల్లో చక్కదనం..వెన్నెల్లో చల్లదనం
అడుగడుగున అందిస్తుందీ..చిరునవ్వులు చిలికిస్తుందీ
నవ్వుల్లో ఏముందో ఇంద్రధనస్సు..అబ్భా
ఖలుక్కు ఖలుక్కు మంటోంది నాలో వయసూ
ఖలుక్కు ఖలుక్కు మంటోంది నాలో వయసూ

ఉడికించే రాతిరిలో..ఊరించే సందడిలో
బాసలనే పానుపు చేసి..ఆశలనే కానుకచేసి
స్వర్గాలు చూడాలి ఆ మనసులో..నేన్..
ఇరుక్కుని ఇరుక్కోని పోవాలి ఆ గుండెలో
ఇరుక్కుని ఇరుక్కోని పోవాలి ఆ గుండెలో

కోడెకారు చిన్నోడు..చేతిలో చెయ్ ఏసాడు..
ఆ చేతిలో ఏముందో..ఆకురాయి..అబ్భా..
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ

No comments: