Wednesday, May 13, 2009

సీతా రాములు ~~ 1980 ~~ రాగం:::భూపాళం

సంగీతం::సత్యం
రచన::దాసరి నారాయణ రావ్
గానం::SP. బాలు


రాగం:::భూపాళం

తొలి సంధ్య వేళలో
తొలి పొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో

వినిపించే రాగం భూపాళం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

తొలి సంధ్య వేళలో
తొలి పొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో

వినిపించే రాగం భూపాళం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం
జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం

గడిచే ప్రతినిమిషం ఎదిగే ప్రతిబింబం
గడిచే ప్రతినిమిషం ఎదిగే ప్రతిబింబం

వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ ఉదయం సంధ్యారాగం మేలుకొలుపే అనురాగం

తొలి సంధ్య వేళలో...ఓ...

ఆ...ఆఆ....ఆఆఆ....
సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్య సమయం
సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్య సమయం

వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం

లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలుపే అనురాగం

తొలి సంధ్య వేళలో
తొలి పొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో

వినిపించే రాగం భూపాళం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

No comments: