Sunday, April 19, 2009

సీతరామ కల్యాణం--1986

సంగీతం::K.Vమహాదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల

:::

విడిపోము మనము ఈ ఎడబాటు క్షణము ఆ పైన కళ్యాణము
కళ్యాణ వైభోగమే
కళ్యాణ వైభోగమే శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే 

:::1

అనుకున్న కొన్నాళ్ళ వనవాసము మునుముందు కావాలి మధుమాసము
అనుకున్న కొన్నాళ్ళ వనవాసము మునుముందు కావాలి మధుమాసము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము
కళ్యాణ వైభోగమే

:::2

మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
మన అంతరంగాలే వేదికగా
కళ్యాణ వైభోగమే

:::3

వలచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా
వలచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా
గెలిచాము కలిసాము దివిమెచ్చగా ఆ ఆ ఆ ఆ ఆ
గెలిచాము కలిసాము దివిమెచ్చగా
కలకాలముందాము నులివెచ్చగా
కళ్యాణ వైభోగమే శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే

No comments: