సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP.బాలు,S.జానకి
Film Directed By::A.Kodandaramireddy
తారాగణం::అక్కినేని,రాధిక,సుజాత,జగ్గయ్య,తులసి,ప్రభాకర రెడ్డి,కార్తీక్.
:::::::::::::::
మల్లెపూలు గుప్పుమన్నవీ పక్కలోనా
వెన్నెలొచ్చి గుచ్చుకొన్నదీ గుండెలోనా
వేడుంది ఒంటిలో జోరుంది వయసులో
బోలేడంత కోరికుంది తీర్చుకోనా...
మల్లెపూలు ఘొల్లుమన్నవీ పక్కలోనా
చల్లగాలి గిల్లుతున్నదీ సంబరానా
ఎర్రాని పెదవిలో ఏర్రైన వయసులో
బోలేడంత కోరికుంది తీర్చుకోనా...
::::1
నీ చిలిపి నవ్వులు ఆ నవ్వు వెలుగులు
నా సొగసు ఆరబోసి మెరిసిపోనా
నీ ఒంటి నునుపులూ..నీ పెదవీ ఎరుపులు
నా వయసు పొంగు నేను కలుపుకోనా
గంగలాగా ఉరికిరానా..కడలిలాగా కలుపుకోనా
నా ఒడిలో ఉయ్యాల లూగించనా..
నా ఎదకు నిను చేర్చి జోకొట్టనా
నీతోటి బ్రతుకంత ఒకవింత గిలిగింత
అనిపించి మెప్పించి ఒప్పించుకోనా
మల్లెపూలు గుప్పుమన్నవీ పక్కలోనా
వెన్నెలొచ్చి గుచ్చుకొన్నదీ గుండెలోనా
ఎర్రాని పెదవిలో ఏర్రైన వయసులో
బోలేడంత కోరికుంది తీర్చుకోనా...
::::2
నీ ముద్దు ముద్దులో మురిపాల సద్దులు
ముప్పోద్దు ముణిగితేలి మురిసిపోనా
నీ మెత్త మెత్తనీ సరికొత్త మత్తులో
నే చిత్ర సిత్తరంగ తట్టుకోనా
గుండెలోనా నిండిపోనా..నిండిపోయీ వుండిపోనా
నీ ప్రేమ నూరేళ్ళు పండించనా..
నీ ఇల్లు వెయ్యేళ్ళు వెలిగించనా..
బంధాలు ముడివేసి అందాల గుడి చేసి
అనురాగ అర్ఛనలే చేయించుకోనా..
మల్లెపూలు ఘొల్లుమన్నవీ పక్కలోనా
చల్లగాలి గిల్లుతున్నదీ సంబరానా
ఎర్రాని పెదవిలో ఏర్రైన వయసులో
బోలేడంత కోరికుంది తీర్చుకోనా...
మల్లెపూలు గుప్పుమన్నవీ పక్కలోనా
వెన్నెలొచ్చి గుచ్చుకొన్నదీ గుండెలోనా
వేడుంది ఒంటిలో జోరుంది వయసులో
బోలేడంత కోరికుంది తీర్చుకోనా...
No comments:
Post a Comment