Monday, September 17, 2007

లవకుశ--1963::కానడ ::రాగం



సంగీతం::ఘంటసాల
రచన::
సముద్రల రాఘవాచార్య(సీనియర్) 
గానం::ఘంటసాల,లీల,సుశీల,మల్లిక్,వైదేహి.

!!! రాగం::కానడ !!!


జయ జయరాం జయ రఘురాం
జయ జయరాం జయ రఘురాం

వాల్మీకి::జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే

జనకుని మాటల తలపై నిలిపీ
తన సుఖముల విడి వనితామణితో
వనముల కేగిన ధర్మావతారుడు
జగదభిరాముడు శ్రీరాముడే

లవకుశులు::కరమున ధనువు శరములు దాల్చి
కరమున ధనువు..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ ఆ ఆఆ
కరమున ధనువు శరములు దాల్చి
ఇరువది చేతుల దొరనే కూలిచి
సురలను గాచిన వీరాధి వీరుడు
జగదభిరాముడు శ్రీరాముడే

జంట::ఆలూ మగలా అనురాగాలకు
ఆలూ మగలా అనురాగాలకు
పోలిక సీతారాములె యనగా
పోలిక సీతారాములె యనగా
వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు
జగదభిరాముడు శ్రీరాముడే

సీత::నిరతము ధర్మము నెరపీ నిలిపీ..ఆఆ
నిరతము ధర్మము నెరపీ నిలిపీ
నరులకు సురలకు తరతరాలకూ
వరవడియైన వర యుగపురుషుడు
జగదభిరాముడు శ్రీరాముడే

బౄందము::ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయు ప్రభువు లేనే లేడని
ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయు ప్రభువు లేనే లేడని
జనులు భజించే పురుషోత్తముడు
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే
జయ జయరాం జయరఘురాం
జయ జయరాం జయరఘురాం
జయ జయరాం జయరఘురాం
జయ జయరాం జయరఘు
రాం

No comments: