Thursday, July 10, 2008

బుల్లెమ్మా బుల్లోడు --1972







సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::దాశరధి
గానం::SP.బాలు,P.సుశీల


::::::::::::::::::::::::::::


అతడు::అమ్మ అన్నది ఒక కమ్మని మాటా
అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా
అతడు::అమ్మ అన్నది ఒక కమ్మని మాటా
అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా
మమతల మూటా

దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మే లేదనువాడు అసలే లేడు
దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మే లేదనువాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు..అమ్మ అన్నదీ
ఆమె:...ఒక కమ్మని మాటా
అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా
మమతల మూటా

అతడు::అమ్మంటే అంతులేని సొమ్మురా
ఆమె::అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా
అతడు::అమ్మ మనసు అమృతమే చిందురా
ఆమె::అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా..ఉందిరా..
ఇద్దరూ::అమ్మ అన్నది ఒక కమ్మని మాటా..
అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా..మమతల మూట

ఆమె::అంగడిలో దొఱకనిది అమ్మ ఒక్కటే
అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
ఆమె::అంగడిలో దొఱకనిది అమ్మ ఒక్కటే
అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అతడు::అమ్మ ఉన్న ఇంటిలో లేనిది యేదీ
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది యేదీ
అమ్మ అనురాగం ఇక నుంచి నీదీ..నాదీ..
ఇద్దరూ::అమ్మ అన్నది ఒక కమ్మని మాటా
అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా..మమతల మూటా..

No comments: