Tuesday, July 24, 2007

ఇంటింటి రామాయణం--1979




సంగీతం::రాజన్ నాగేంద్ర
రచన ::వేటూరి
గానం::SP.బాలు
 తారాగణం::రంగనాథ్,ప్రభ,చంద్రమోహన్,జయసుధ,నూతన్‌ప్రసాద్,గిరిబాబు,రమాప్రభ. 
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగ

ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మొజులలో నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మోజులలో నీ విరజాజులై...
మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలె
ఈ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలే
మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా


మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా..హాహా..హాహా..ఆ
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా
అందిన పొందులోనె అందలేని విందులీయవె
కలలిక పండే కలయిక నేడే కావాలి వేడిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా


మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

1 comment:

కమల్ said...

it's a nice song..i like very much this song..anywho..thank u..