Saturday, June 16, 2007

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::భాగేశ్వరి::రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::ఘంటసాల
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B. సరోజాదేవి,S. వరలక్ష్మి, ధూళిపాళ,
అల్లు రామలింగయ్య
భాగేశ్వరి::రాగం  పల్లవి::

అలిగితివ సఖీ ప్రియ కలత మానవా
అలిగితివ సఖీ ప్రియ కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏల జాలవా
అలిగితివ సఖి ప్రియా కలత మానవా

చరణం::1

లేని తగవు నటింతువా మనసు తెలియనెంచితివా
లేని తగవు నటింతువా మనసు తెలియనెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక దయను జూడవా
అలిగితివ సఖీ ప్రియ కలత మానవా

చరణం::2

నీవె నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని
నీవె నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని
సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా
అలిగితివ సఖీ ప్రియ కలత మానవా

చరణం::3

ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
భరియింపగ నా తరమా కనికరించవా..ఆఆఆ

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్‌క బూని తాచిన అది నాకు మన్ననయ - చెల్వగు నీ పదపల్లవము మత్ తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియెద -
అల్క మానవుగదా యికనైన అరాళ కుంతలా..."

2 comments:

రానారె said...

ఈ పాట చివర ఒక పద్యం ఉండాలి ... నాలుగు పాదాలుగా విభజించి రాసే ఓపిక లేక ఇలా రాసేస్తున్నాను:
"నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్‌క బూని తాచిన అది నాకు మన్ననయ - చెల్వగు నీ పదపల్లవము మత్ తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియెద - అల్క మానవుగదా యికనైన అరాళ కుంతలా..."

Shakthi said...

HellO raanaarE gaaru namastE
chaalaa thanks anDi
naaku teliyaka raayalEdu :(
meeru raasindE "copy" chEsi "post" chEsaananDi maLLi maLLi raavaalani kOrutu :)