సంగీతం::సత్యం
రచన::దాశరధి గానం::AM.రాజ,P.సుశీల
రాగం:::శివరంజని:::
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే
ఏనోము ఫలమో ఏ దేవివరమో నీదాననైనానులే..
సిరిమల్లేసొగసూ జాబిల్లివెలుగూ ఈరేయి నీకోసమే..
ఓ...ఓ...ఓ...ఓ...
పానుపు మురుసింది మనజంట చూసీ
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసీ
పానుపు మురుసింది మనజంట చూసీ
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసీ
వలచిన ప్రియుని కలిసిన వేళా
వలచిన ప్రియుని కలిసిన వేళా
తనువంత పులకింతలే...
సిరిమల్లె సొగసూ
జాబిల్లి వెలుగు
నీలోనే చూసానులే..
ఓ...ఓ...ఓ...ఓ...
దివిలో నెలరాజు దిగివచ్చినాడూ
భువిలో కలువమ్మ చేయ్ పట్టినాడు
దివిలో నెలరాజు దిగివచ్చినాడూ
భువిలో కలువమ్మ చేయ్ పట్టినాడు
నీతోటి చెలిమీ
నిజమైన కలిమీ
నీతోటి చెలిమీ
నిజమైన కలిమీ
నిలవాలి కలకాలమూ...
సిరిమల్లె సొగసూ
జాబిల్లి వెలుగు
నీలోనే చూసానులే
..మ్మ్..మ్మ్..మ్మ్..సిరిమల్లే సొగసూ
జాబిల్లి వెలుగూ
ఈ రేయి నీకోసమే..
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...
No comments:
Post a Comment