Friday, December 14, 2007
సింహాసనం --- 1986
సంగీతం::బప్పిలహరి
గానం::రాజ్ సీతారాం,P.సుశీల
ఇది కలయని నేననుకోనా
కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని
కలదో లేదో అనుకోనా
లాలలలా...లలలల..లాలలాలా..
లాలలా...లా...లాలలా...
ఇది కలయని నేననుకోనా
కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని
కలదో లేదో అనుకోనా
లాలలలా...లలలల..లాలలాలా..
నీ ఊహల ఊయలలోనా ఊర్వశినై ఊగిపోనా
నీ అడుగుల సవ్వడిలోనా సిరిమువ్వై నిలిచిపోనా
నీ ఊహల ఊయలలోనా ఊర్వశినై ఊగిపోనా
నీ అడుగుల సవ్వడిలోనా సిరిమువ్వై నిలిచిపోనా
లాలలలా...లలలల..లాలలాలా..
నీ కంటిపాపలోనా నా నీడచూసుకోనా
నీ నీడ చలువలలోనా నూరేళ్ళు వుండిపోనా
!! ఇది కలయని నేననుకోనా
కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని
కలదో లేదో అనుకోనా !!
నీ జీవనగమనంలోనా జానకినై జడచిరానా
నీ మయూరి నడకలోనా లయనేనై కలసిపోనా
నీ జీవనగమనంలోనా జానకినై జడచిరానా
నీ మయూరి నడకలోనా లయనేనై కలసిపోనా
లాలలలా...లలలల..లాలలాలా..
నీ సిగ్గుల బుగ్గలలోనా ఆ కెంపులు దోచుకోనా
నను దోచిన నీ దొరతనము నా లోనే దాచుకోనా
!! ఇది కలయని నేననుకోనా
కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని
కలదో లేదో అనుకోనా
లాలలలా...లలలల..లాలలాలా..
లాలలా...లా...లాలలా... !!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment